Header Banner

చైనాలో మరో మహమ్మారి! గబ్బిలాల్లో కరోనా లాంటి వైరస్! కారణం ఇదే!

  Sat Feb 22, 2025 08:29        Others

కొవిడ్ వైరస్‌కు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త వైరస్ వెలుగుచూసిందన్న వార్తలు.. యావత్ ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలకు గురి చేస్తున్నాయి. హెచ్‌కెయూ5 కోవ్‌ 2 వైరస్‌ను గబ్బిలాల్లో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కరోనా వైరస్‌కు కారణం అయిన సార్స్ కోవ్-2ను తాజా హెచ్‌కెయూ5 కోవ్‌ 2 వైరస్‌ పోలి ఉన్నట్లు తేల్చారు. ఈ హెచ్‌కెయూ5 కోవ్‌ 2 వైరస్‌.. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు చెబుతుండటం తీవ్ర సంచలనంగా మారింది. 

 

చైనాలో వెలుగు చూసిన ఈ హెచ్‌కెయూ5 కోవ్‌ 2 వైరస్‌.. కొవిడ్-19కి కారణం అయిన SARS-CoV-2 వైరస్‌ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారని హాంకాంగ్‌కు చెందిన సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. కరోనా వైరస్‌ల గురించి గబ్బిలాలపై అనేక పరిశోధనలు చేసి "బ్యాట్ ఉమెన్‌" అనే పేరు గాంచిన ప్రముఖ చైనా వైరాలజిస్ట్ షీ ఝెంగ్‌లీ.. ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం వహించారు. ఇందులో గాంఘ్జౌ లేబోరేటరీ, గాంఘ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ పరిశోధనకు సంబంధించిన నివేదికను సెల్‌ జర్నల్‌లో సమీక్షకు ఉంచినట్లు సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఈ హెచ్‌కెయూ5 కోవ్‌ 2 వైరస్‌ మెర్బెకోవైరస్‌తోపాటు ప్రాణాంతక మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌-కోవ్‌) ఉప రకానికి చెందిందని షీ ఝెంగ్‌లీ పరిశోధకుల బృందం తేల్చింది. ఈ వైరస్ హెచ్‌కేయూ5 కొవిడ్ వైరస్‌ జాతికి చెందినదిగా పేర్కొన్నారు. 

 

అయితే ఈ వైరస్‌ను మొట్టమొదటగా హాంకాంగ్‌లోని జపనీస్‌ పిపిస్ట్రెల్‌ రకం గబ్బిలాల్లో గుర్తించినట్లు తెలిపారు. తాజా అధ్యయనం ప్రకారం.. హెచ్‌కేయూ5-కోవ్-2 వైరస్ నేరుగా లేదా మధ్యలో ఉన్న జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఈ హెచ్‌కేయూ5-కోవ్-2 వైరస్‌ సామర్థ్యం కరోనా వైరస్‌తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెప్పడం కాస్త రిలీఫ్‌గా మారింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #China #Virus #Covid #Health #Bats